నేస్తమా........ !
జీవితమనే చిరుమొలకను
నీ చెలిమితో
చిగురింపచేసినావు
మొక్క ప్రాణం తీసే చెదలని
భయపడ్డాను నాడు
కానీ......... !
చెలిమి వెన్నెలను కురిపించి
స్నేహ సుమాలు పూయించే
తోటమాలిని ఈనాడే
చూసాను నీలో
నీ స్వచ్ఛమైన స్నేహనికి
తలవంచుతున్నాను
నీ వంటి మిత్రునికి నేస్తమైనందుకు
గర్వపడుతున్నాను!
ఈ చెలిమిని చిరకాలం
చెరగని స్మృతిగా
మిగిలిపోనివ్వు………..!

Friendship forever................
ReplyDelete