ప్రాతః సంధ్య వేళ నీలాకాశంలో ఎగిరే పక్షుల వలె
స్వేచ్ఛగా విహరించాలని
భీకరారణ్యంలో సైతం చిరునవ్వులు చిందించే
లేడిపిల్లలా గెంతాలని
మేఘావృతమైన వేళ ఆనందంతో ఊయలలూగే
నెమలినై నాట్యమాడాలని
స్వచ్ఛమైన మనసులో స్థానం పొందాలని,
చల్లని ఒడిలో పసిపాపనై ఒదిగి పోవాలని,
నీ మదిలో చెరిగి పోని గురుతై మిగిలిపోవాలని,
నా చిన్నారి మదిలో ఉన్న అతి చిన్ని ఆశ

No comments:
Post a Comment