Saturday, 9 November 2013

నీతో గడిపే ఒక్క క్షణం చాలు






ప్రియా!

     కోటి రతనాల రాశులు వద్దు

     నీ నవ్వుల పువ్వులు చాలు  

     వేయి వేణువుల నాదాలు వద్దు

     మైమరపించే నీ మాటలు చాలు

     పున్నమి వెన్నెల చల్లదనాలు వద్దు

     సున్నితమైన నీ కరస్పర్శ చాలు

     నిండు నూరేళ్ల జీవితం వద్దు


     నీతో గడిపే ఒక్క క్షణం చాలు!!!

No comments:

Post a Comment