ఆస్వాదించే మనసుంటే ప్రతిదీ
అందంగానే కనిపిస్తుందంటారు
నిజమేనేమో అని అనిపించక మానదు
మెల్లగా మేను స్పృశించే చిరుగాలులు
గాలికి లయబద్దంగా ఆడే
పంటపొలాలు
వాటికి సరికొత్త అందం తెచ్చే
రవి కిరణాలు
అందమైన వెన్నెల రాత్రులు
అమావాస్య నిశిని మరిపించే
మిణుగురులు
పుడమి సౌoదర్యం ఇనుమడింపచేసే సీతాకోకచిలుకలు
పూవుల పరిమళం, కోయిల గానం
తుమ్మెదల ఝుంకారం
ఎన్ని చూసినా మనసు నిండదే............?
ఎన్ని దర్శించినా కనులు ఆగవే................?
అందుకేనేమో!!!
ఆస్వాదించే మనసుంటే
ఎన్నో అందాలు అన్నది!!!

No comments:
Post a Comment