Sunday, 17 November 2013

మన స్నేహం


సొంత గూళ్ళు వేరైనా, ఒకే చోట కలిసాము 
కన్నవారు వేరైనా, ఒకటిగా మెలిగాము 

రక్త సంబంధం లేకపోయినా తోబుట్టువుల్లా పెరిగాము 

సుఖమైనా, దుఃఖమైనా, కష్టనష్టాలెన్నెదురైనా....... 
'నీ' 'నా' భేధం మరచి 
'మన' అనే భావనను పంచుకున్నాము 

భావాలు వేరైనా, అనుభవాలెన్నో మిగుల్చుకున్నాం 

మతాలు వేరైనా, అభిమతం ఒకటేననుకున్నాం 
మన స్నేహానికి ఎదురే ఉండదని, ఉండకూడదని 
                                      అనుకున్నాం
కానీ, చివరకు కాలానికి తల వంచక తప్పడం లేదు 
మనం చివరికి విడిపోక తప్పడం లేదు

మనలను చెంత చేర్చిన బంధమేదో 

                       అనుబంధమై మన హృదయాలను  పెనవేసింది 
మన ఈ ఎడబాటు శరీరాలకు కాకూడదని........ 
ఎన్నటికీ మన మనస్సులలో ఈ మధుర క్షణాలు 
            తీపిజ్జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని ఆశిస్తూ.......!!! 

No comments:

Post a Comment