ప్రియా .......!
నిను చూడాలనిపిస్తే......
అద్దం ముందు నిలబడి నా కంటిపాపలో
నీ ప్రతిబింబాన్ని చూస్తాను
నీ పేరు వినాలనిపిస్తే......
నా గుండెపై చేయి వేసి వింటాను
నీ స్పర్శ కావాలనిపిస్తే......
మేడ మీదకెక్కి చిరుగాలిలో
చేతులు చాస్తాను
ఇదంతా నువ్వు లేవన్న
భ్రమ కాదు
నాలో నువ్వునావన్న ధీమా.........!
No comments:
Post a Comment