కంటిని ఎల్లవేళలా కాపాడు కనురెప్పలా
నేను నిన్ను కాపాడుకుంటాను
తొలకరి జల్లుల నుండి జడివానను సైతం
తనలో ఇముడ్చుకునే భూమిలా
నిన్ను నాలో ఇముడ్చుకుంటాను
ఎప్పుడూ నీవు నాలో ఉండాలనుకుంటాను
లేకపోతే అంతర్మథనం చెందుతాను
నా జీవిత శూన్య నిశీధిలో ప్రసరించిన
తొలి వెలుగు కిరణానివి నువ్వు
పూవుని వీడని పరిమళంలా నీవు నను
వెన్నంటి ఉండాలని ఆశపడతాను
నీవు కూడా నన్ను అలాగే అభిమానించాలని
కోరుకుంటాను
కానీ, నేస్తమా.............................!
నీవు నా ప్రాణమై, నా తనువులో, మనసులో,
అంతరాత్మలో కూడా స్థానువై............
స్థానం పొందియున్నావని మరువకుమా ...................!!

Nice kavithalu yar........
ReplyDelete