నీ జ్ఞాపకం
నువ్వు దగ్గరున్నప్పుడు నీ కబుర్లు
నువ్వు దూరమైనప్పుడు నీ జ్ఞాపకాలు
ఏకాంతంలోకి తొంగిచూస్తాయి
వడివడిగా అల్లుకుంటున్న ఊసుల్ని
పక్కన పెట్టి వెళ్ళిపోదామంటే
ఆ మౌన సవ్వడిని దూరం చేయనంటూ
నవ్వు కూడా రానని మొరాయిస్తుందేం!
ఇప్పుడిప్పుడే తెలుస్తోంది
నా మనసుకు మాటలొస్తే
పలికే తొలి మాట
"నువ్వంటే నాకిష్టం" అని
No comments:
Post a Comment