ప్రియతమా...........!!
ఎదుటే
నీవున్నా..,
ఎదుటపడలేకున్నా..!
పిలవాలని
ఉన్నా..,
మాట
రాక ఊరుకున్నా..!
ఎదలో
నీవు కొలువున్నా..,
నీకు
తెలుపలేకున్నా..!
కలలో
కలవరపెడుతుంటే..,
నిదురే
మరచిపోతున్నా..!
నా
బాధకు కారణం నీవని తెలుపాలని
ఉన్నా ..,
అందుకు
నిన్ను శిక్షించనా?
లేక, నాకే ఇది శిక్ష
అని సరిపెట్టుకోనా..!?
నా బాధకు మందు నీవేనని ఎన్నడైనా నీకు తెలుపగలనా...!!?

No comments:
Post a Comment