Saturday, 17 February 2018

వేమన పద్యరత్నావళి



ప:  శ్రీ యన మంగళ దేవత
      శ్రీ యనగా విష్ణుపత్ని సిరి సంపదయున్!
      శ్రీ యనెడి మూలశక్తిని
      శ్రీ యని వర్ణింపు మెపుడు స్తిరమతి వేమ!!

తా:  'శ్రీ' కారానికి గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే ఈ ఏకాక్షర పదానికి ఎన్నో అర్థాలున్నాయి.
       శుభం కలిగించే దేవత లక్ష్మీ దేవి, సిరి సంపదలనిచ్చే మూల శక్తి. అటువంటి దేవతను
        నిరంతరం స్తుతిస్తూ ఉండాలి. 

No comments:

Post a Comment