Friday, 15 November 2013

నాడు నేడు



పసిపిల్లల బోసినవ్వులు, జగమును నింపు ఆనంద కెరటాలు,
నాడు ప్రపంచమంతా వారి నవ్వులు, నేడు ఎటు చూసినా బాల కార్మీకులు

వెతికినా లేవు వారిలో సంతోషపు జల్లులు,

వారిని కదిలించిన గోచరించు విషాద ఛాయలు,
కని విని ఎరుగరు వారు ఆటపాటలు,
వారికి పరిచయం కేవలం చావుబ్రతుకులు,

ఆనాడు సత్యం "నేటి బాలలే రేపటి పౌరులు" అన్నది నిజం 

ఈనాడు నిత్యం బాల్యాన్ని కోల్పోతున్న అభాగ్యులు అసంఖ్యాకం
వారి జీవితాలను బాగుపరుస్తామంటున్న ప్రభుత్వం 
వారిని గమనించక చేస్తోంది అర్థం లేని వాగ్ధానం 

మితిమీరిన జనాభా, విపరీతమైన పేదరికం, 

అస్తవ్యస్తమైన పరిపాలన, ఇoదుకు వినాశకారక హస్తాలు

వారి భావి జీవితమంతా కనిపించని సుడిగుండాలు

అయినా వారి దరి చేరవు స్వార్థపు కెరటాలు
ఎన్నడూ వారికున్నస్థిరాస్థి వారి స్వచ్ఛమైన మనసు










No comments:

Post a Comment